హీరోయిన్ పూజా హెగ్డే.. మరో విభిన్న పాత్రలో కనిపించేదుకు సిద్ధమవుతోంది. వాల్మీకిలో నటిస్తున్న ఈ హీరోయిన్ లుక్‌ను చిత్రబృందం ఆదివారం విడుదల చేసింది. ఇందులో శ్రీదేవీ అనే పూర్తిస్థాయి పల్లెటూరి అమ్మాయిగా కనిపించనుందీ భామ.
ఫస్ట్‌లుక్: పల్లెటూరి భామ శ్రీదేవీగా పూజా హెగ్డే - pooja hegde
'వాల్మీకి' సినిమాలోని పూజా హెగ్డే ఫస్ట్‌లుక్ ఆకట్టుకుంటోంది. శ్రీదేవీ అనే అమ్మాయి పాత్రలో నటిస్తుందీ కథానాయిక.
హీరోయిన్ పూజా హెగ్డే
ఈ సినిమాలో మెగాప్రిన్స్ వరుణ్తేజ్ప్రధాన పాత్రలోనటిస్తున్నాడు. ప్రతినాయకుడి లక్షణాలున్న పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నాడు వరుణ్. ఇతర పాత్రల్లో అధర్వ మురళి, మృణాళిని రవి కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతమందిస్తున్నాడు. మాస్ చిత్రాలు రూపొందించే హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 14 రీల్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది చదవండి: మహేశ్ కోసం 'కొండారెడ్డి బురుజు' మరోసారి..!
Last Updated : Sep 28, 2019, 7:01 AM IST