Poojahegdey Alluarha dance: త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా విడుదలైన సినిమా 'అల వైకుంఠపురములో' ఎంతగా హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా ఈ మూవీ విడుదలై రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హీరోయిన్ పూజాహెగ్డే ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. అల్లు అర్జున్ తనయ అర్హతో కలిసి చేసిన 'బుట్టబొమ్మ' డ్యాన్స్ వీడియోను అభిమానులతో పంచుకుంది.
"నేను అల్లుఅర్జున్ కలిసి చేసిన డ్యాన్స్‌ను చూశారు కదా? నా షాట్ కోసం వెయిట్ చేసే ఖాళీ సమయంలో అర్హతో కలిసి డ్యాన్స్ చేశాను. మాకు తెలీకుండానే బుట్టబొమ్మ స్టెప్పులను ఇద్దం ముందే కనిపెట్టేశామేమో" అని వ్యాఖ్య రాసుకొచ్చింది.