తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముద్దు సన్నివేశాలకు సిద్ధమయ్యా కానీ! - పూజా ముద్దు సీన్​

దక్షిణాదితో పాటు బాలీవుడ్​లోనూ హీరోయిన్​గా అలరిస్తోన్న పూజా హెగ్డే. ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ముద్దు సన్నివేశాల తీసేటపుడు తాను ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది.

pooja hegde was prepared for lip lock
లిప్​ లాక్​కు సిద్ధమయ్యా కానీ..!:పూజా హెగ్డే

By

Published : Dec 28, 2019, 12:19 PM IST

హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ ఏడాది 'మహర్షి', 'గద్దలకొండ గణేష్', 'హౌస్​ఫుల్ 4' చిత్రాలతో హిట్లు అందుకుంది. ఆమె నటించిన 'అల వైకుంఠపురములో'.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఈ భామ.. సినిమాల్లోని ముద్దు సన్నివేశాల గురించి చెప్పింది. అలాంటి సీన్ల తీసేటపుడు చాలా ఇబ్బందులు పడుతుంటామంది.

ప్రేక్షకులకు బాగుంటుంది కానీ
లిప్​లాక్ సీన్లను వెండితెరపై చూసేందుకు బాగున్నా.. ఆ సన్నివేశాల్లో నటింటేందుకు ఎంత కష్టపడతామో చూసేవారికి తెలియదని చెప్పింది పూజా. ఈ సందర్భంగా 'మొహంజోదారో' సినిమాలో హృతిక్​ రోషన్​కు ముద్దుపెట్టిన సీన్​ను గుర్తు చేసుకుంది.

"మొహంజోదారో'లో హృతిక్​తో ముద్దు సీన్​ ఉంటుందని షూట్​కు ముందు దర్శకుడు అశుతోష్​ గోవారికర్ వివరించాడు. అందుకు నేనూ సిద్ధమయ్యా. కానీ, నాకు వణుకు పుట్టింది. కారణం నేను అలాంటి సన్నివేశాలు అంతకు ముందు చేయలేదు. మా చుట్టూ చాలా మంది నిలబడి ఉన్నారు. ఆ సమయంలో చాలా కష్టం అనిపించింది. రొమాంటిక్​ సన్నివేశాల్లో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ చాలా ముఖ్యం. ఈ విషయం పక్కనపెడితే... కెమెరా ట్రిక్స్​ ఈ సీన్లలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి వల్ల ఇలాంటి ఇబ్బందికర సంఘటనల నుంచి మేం తప్పించుకుంటుంటాం"
- పూజా హెగ్డే, నటి

పూజా... ప్రస్తుతం ప్రభాస్​కు జోడీగా 'జాన్​' సినిమాలో నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్​లో చిత్రీకరణ జరుగుతోంది.

ఇదీ చదవండి:అవకాశాలు అందుకుని.. ఆకట్టుకుని.. అలరించి

ABOUT THE AUTHOR

...view details