తెలంగాణ

telangana

ETV Bharat / sitara

షూటింగ్​లో ఇబ్బంది పడ్డాం: పూజా హెగ్డే - poojahegdey trouble in radhe syam shooting

ఇటలీలో చిత్రీకరణ జరుపుకొంటోన్న 'రాధేశ్యామ్'​ సినిమా గురించి మాట్లాడారు హీరోయిన్​ పూజాహెగ్డే. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నామని తెలిపారు. అయితే షూటింగ్​లో తొలి రెండు రోజులు మాత్రం చాలా ఇబ్బంది పడినట్లు వెల్లడించారు.

Pooja Hegde
పూజాహెగ్డే

By

Published : Oct 18, 2020, 3:55 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌-పూజాహెగ్డే జంటగా నటిస్తోన్న చిత్రం 'రాధేశ్యామ్'‌. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ప్రభాస్‌-పూజాహెగ్డేపై పలు కీలక సన్నివేశాలు ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌ గురించి తాజాగా పూజాహెగ్డే స్పందించారు. కరోనా వైరస్‌ కారణంగా అన్నిరకాల జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌లో పాల్గొంటున్నామని వివరించారు.

"ఇటలీలో చిన్న సెట్‌ వేసుకుని.. అతి తక్కువ మంది బృందంతో జాగ్రత్తలు పాటిస్తూ షూట్‌ చేస్తున్నాం. ప్రతిరోజూ సెట్‌లోకి అడుగుపెట్టే ముందు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాం. సెట్‌లో ఉన్నంతసేపు మాస్క్‌ ధరిస్తున్నాం. కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రమే మాస్క్‌ తీస్తున్నాం. ఇటలీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. షూట్‌ ప్రారంభించిన మొదటి రెండు రోజులు భయం, ఇబ్బందిగా అనిపించింది. ఆ తర్వాత అలవాటైపోయింది" అని పూజ వెల్లడించారు.

ఇదీ చూడండి థ్రిల్లర్​ కథతో దర్శకురాలిగా మారిన హీరోయిన్!

ABOUT THE AUTHOR

...view details