గతేడాది ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి.. తన కొత్త సినిమా టైటిల్ 'ఆచార్య' అని చెప్పి నోరుజారారు. ఇప్పుడు పూజా హెగ్డే కూడా అలానే చేసింది! 'ఆచార్య'లో తన పాత్రకు సంబంధించిన షెడ్యూల్ పూర్తయిందని చెబుతూ ఇన్‌స్టా స్టోరీస్‌లో ఓ వీడియో పెట్టింది.
ఈ సినిమాలో చరణ్ సరసన పూజా హెగ్డే చేస్తోందని వార్తలు వచ్చినప్పటికీ చిత్రబృందం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పుడు పూజా తను నటిస్తున్నట్లు చెప్పేయడం, అధికారికంగా ఖరారు చేసినట్లు అయింది.