తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ ముద్దుగుమ్మకు బన్నీ మూడో ఛాన్స్​! - pooja hegde

ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్ తన లక్కీ హీరోయిన్​కు మరో అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే?

icon movie
అల్లు అర్జున్

By

Published : Sep 6, 2021, 11:34 AM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్​ 'ఐకాన్' మూవీలో హీరోయిన్లుగా పూజాహెగ్డే, అనుపమా పరమేశ్వరన్​​లను తీసుకోనున్నారని టాలీవుడ్ వర్గాల సమాచారం. బన్నీతో పూజా మినహా.. ఏ హీరోయిన్ కూడా మూడోసారి నటించలేదు. అలాంటిది ఈ వార్తే నిజమైతే బన్నీతో పూజ మూడుసార్లు నటించిన ఛాన్స్ కొట్టేసినట్లు అవుతుంది. ఇంతకుముందు 'దువ్వాడ జగన్నాథం', 'అల వైకుంఠపురములో' సినిమాల్లో కనువిందు చేసిందీ జంట.

పూజా హెగ్డే

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'ఐకాన్' రూపుదిద్దుకోనుంది. దిల్ రాజు నిర్మాత. 'పుష్ప పార్ట్ 1' తర్వాత ఈ మూవీ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది.

పూజా హెగ్డే
పూజ నటించిన 'రాధేశ్యామ్', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్​లర్' సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అలాగే 'సర్కస్', 'బీస్ట్', 'ఆచార్య' సినిమాల్లోనూ నటిస్తోంది. మహేశ్​బాబు కొత్త సినిమాలోనూ హీరోయిన్​గా పూజా ఎంపికైంది.

ఇదీ చూడండి:Pooja Hegde: పూజా మేడమ్ సార్.. మేడమ్ అంతే!

ABOUT THE AUTHOR

...view details