తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే నేనూ అలా ఆలోచిస్తా: పూజాహెగ్డే - పూజా హెగ్డే కుటుంబం

తక్కవ కాలంలోనే అగ్రహీరోల పక్కన నటిస్తూ క్రేజ్ తెచ్చుకుంటోంది హీరోయిన్ పూజాహెగ్డే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ముద్దుగుమ్మ.. తన గురించి, తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పింది.

Pooja hegde shared interesting things about her personal and family
అందుకే నేనూ అలా ఆలోచిస్తా: పూజాహెగ్డే

By

Published : Jan 27, 2020, 2:38 PM IST

Updated : Feb 28, 2020, 3:35 AM IST

'ఒక లైలా కోసం'తో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే.. అగ్ర​ హీరోలతో కలిసి నటిస్తూ, స్టార్​ హీరోయిన్​గా వెలిగిపోతుంది. ప్రస్తుతం ప్రభాస్ 'జాన్', అఖిల్​ కొత్త సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన గురించి తన కుటుంబం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది.

"నేను కథలతో పాటు సినిమా బడ్జెట్, కలెక్షన్స్ గురించి తెలుసుకుంటా. నిర్మాతలు నాపై నమ్మకంతో అడిగినంత పారితోషికం ఇస్తున్నారు. వాళ్ళ చిత్రాల్లో నేను ఉండాలనుకుంటున్నారు. అందుకే నా పాత్రకు న్యాయం చేయడం సహా సినిమా గురించి కూడా ఆలోచిస్తా. నిర్మాతలకు లాభాలు రావడం నాకూ ముఖ్యమే కదా. ఎంతైనా నేను శెట్టి ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని. మా రక్తంలోనే వ్యాపారం ఉంది. మా తాతయ్యకు రెస్టారెంట్లు ఉన్నాయి. అందుకేమో నేనూ వ్యాపారవేత్తలా ఆలోచిస్తున్నా"
- పూజా హెగ్డే, నటి

పూజాహెగ్డే.. ఇటీవల అల్లుఅర్జున్​ 'అల వైకుంఠపురములో' సినిమాలో హీరోయిన్​గా నటించింది. ప్రస్తుతం బాక్సాఫీస్​ వద్ద జోరు చూపిస్తోందీ చిత్రం.

ఇదీ చదవండి: 'కార్తికేయ' సీక్వెల్​లో ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు!

Last Updated : Feb 28, 2020, 3:35 AM IST

ABOUT THE AUTHOR

...view details