Pooja Hegde Prabhas: కెరీర్లో వరుస సినిమాలతో దూసుకెళ్తోంది స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఆ చిత్ర షూటింగ్లో హీరో ప్రభాస్‌తో భేదాభిప్రాయాలు వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రభాస్‌తో మాత్రమే కాకుండా సమంతతో కూడా విభేదాలున్నట్లు నెటిజన్లు మాట్లాడుకున్నారు. వీటిన్నంటిపై పూజ స్పందించింది.
"సోషల్‌మీడియాలో అలాంటి పుకార్లు వచ్చినప్పటికీ ..సెట్స్‌లో మా మధ్య ఏం జరగలేదు. నాకు, ప్రభాస్‌కు ఎలాంటి విభేదాలు లేవు. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి విషయాలు మాట్లాడుకోవడానికే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దానికి నేనేం చేయలేను. నా సోషల్ మీడియా హ్యాండిళ్లలో ఎప్పుడూ మంచి విషయాల కోసమే పోస్టులు ఉంటాయి. అలాంటి పుకార్లను నేను పట్టించుకోను"
- --పూజా హెగ్డే, హీరోయిన్