తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కాళ్లతో ధన్యవాదాలు చెప్పిన పూజా హెగ్డే - pooja radheshyam

ఇన్​స్టాలో 11 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను అందుకున్న హీరోయిన్ పూజాహెగ్డే.. తన కాళ్లు ఉపయోగించి నెటిజన్లకు ధన్యవాదాలు తెలిపింది.

కాళ్లతో ధన్యవాదాలు చెప్పిన పూజా హెగ్డే
హీరోయిన్ పూజాహెగ్డే

By

Published : Jul 16, 2020, 10:00 AM IST

ప్రముఖ హీరోయిన్​ పూజా హెగ్డే ఇన్​స్టా ఫాలోవర్స్ 11 మిలియన్లకు చేరుకున్నారు. అయితే అందరిలా కాకుండా వారికి విచిత్రంగా ధన్యవాదాలు చెప్పింది. తన రెండు కాళ్లను ఉపయోగించి 11 అంకె వచ్చేలా చేసి ఆకట్టుకుంది. ఈ ఫొటోను పోస్ట్ చేసి, అలా చేయడానికి గల కారణాన్ని వెల్లడించింది.

హీరోయిన్ పూజా హెగ్డే ఇన్​స్టా పోస్ట్

"ఈ ఏడాది ప్రారంభం నుంచి నా కాళ్ల గురించే మాట్లాడుకున్నారు(మీకు తెలుసని అనుకుంటున్నా). అందుకే ఇలా వైవిధ్యంగా పోస్ట్ పెట్టాలనుకున్నాను. మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలను సదా గౌరవిస్తాను" అని ఇన్​స్టాలో పూజా రాసుకొచ్చింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో 'అల వైకుంఠపురములో' సినిమాతో అలరించిన పూజా హెగ్డే.. డార్లింగ్ ప్రభాస్​తో 'రాధేశ్యామ్​'లో ప్రస్తుతం నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్ర ఫస్ట్​లుక్ పోస్టర్​ను విడుదల చేయగా, అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. దీనితో పాటే అఖిల్ 'మోస్ట్​ ఎలిజిబుల్ బ్యాచిలర్​'లోనూ హీరోయిన్​గా నటిస్తోంది.

రాధేశ్యామ్ సినిమా పోస్టర్

ABOUT THE AUTHOR

...view details