హీరోయిన్ పూజా హెగ్డే.. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ బిజీగా ఉంది. సంక్రాంతికి 'అల వైకుంఠపురములో'తో హిట్ కొట్టిన ఈ భామ.. ప్రస్తుతం ప్రభాస్, అఖిల్‌ల కొత్త సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఈమె రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
అక్కినేని అఖిల్.. ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా చేస్తున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ చివరిదశకు చేరుకుంది. ఇందులో హీరోయిన్గా నటిస్తున్న పూజా హెగ్డే, హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటోందని టాక్.