హీరోయిన్ పూజాహెగ్డే ప్రస్తుతం విహారయాత్రలో బిజీగా ఉంది. ఇటీవలే 'హౌస్‌ఫుల్4' అనే హిందీ చిత్రంతో ఆకట్టుకున్న ఈ భామ.. గత మూడు రోజులుగా పలు ప్రదేశాల్ని చుట్టేస్తోంది. ఆ సంగతులను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటోంది. మక్కా, సౌదీ అరేబియాలో తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఎంత అందమైన కట్టడాలు, మంచి ఫుడ్, పసందైన యాత్ర ఇది అంటూ ఇన్‌స్టాలో ఫోటోలు పంచుకుంది పూజా. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో ఉందీ భామ.