తెలంగాణ

telangana

By

Published : Nov 8, 2020, 8:10 PM IST

ETV Bharat / sitara

వివాదాస్పద వ్యాఖ్యలపై పూజా హెగ్దే క్లారిటీ

ఇటీవలే దక్షిణాది సినీ పరిశ్రమపై కామెంట్​ చేసి ఇరకాటంలో పడింది పూజా హెగ్దే. అయితే, తాను చేసిన వ్యాఖ్యలు వేరే సందర్భాన్ని ఉద్దేశిస్తూ చేసినవని కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిందీ భామ.

pooja hegde
కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన పూజా హెగ్దే

దక్షిణాది సినీ ఇండస్ట్రీపై పూజా హెగ్దే చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి. దీనిపై మరోసారి స్పందించింది నటి పూజ. తాను వేరే సందర్భాన్ని ఉద్దేశిస్తూ ఆ వ్యాఖ్యలు చేశానని పేర్కొంది.

"మొదట నేను ఇంటర్యూలో చేసిన వ్యాఖ్యలు వేరే సందర్భాన్ని ఉద్దేశిస్తూ చేసినవి. నాకు తెలుగు సినీ పరిశ్రమ అంటే ప్రాణం. ఈ పరిశ్రమకు నేను రుణపడి ఉంటాను. నా వ్యాఖ్యలు ఎలాంటి అపార్ధాలకు దారితీయకూడదని ఈ విషయంపై క్లారిటీ ఇస్తున్నా".

-పూజా హెగ్దే, సినీ నటి.

ఇటీవలే ప్రభాస్​తో కలిసి 'రాధే శ్యామ్​' సినిమా షూటింగ్ ఇటలీలో పూర్తి చేసుకుని వచ్చిన పూజా హెగ్దే.. ఓ ఛానల్​కు ప్రత్యేక ఇంటర్యూ ఇచ్చింది. ఇందులో దక్షిణాది సినిమాలను అవమానపరిచేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది.

ఇదీ చదవండి:'బైడెన్ గజినీ.. కమల విజయం చరిత్రాత్మకం'

ABOUT THE AUTHOR

...view details