తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమాలకూ విధిరాత ఉంటుంది.. అందుకే అలా..' - పూజా హెగ్డే సినిమాలు

pooja hegde comments on destiny: విధిరాత మనుషులకే కాదు సినిమాలకూ ఉంటుందని అంటోంది అందాల ముద్దుగుమ్మ పూజా హెగ్డే. కొన్నిసార్లు.. బాగుంది అనుకున్న సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుందని చెప్పుకొచ్చింది. మరోవైపు, రాధేశ్యామ్​లో తన పెర్​ఫార్మెన్స్ పట్ల సంతోషంగా ఉన్నానని తెలిపింది.

pooja hegde comments
పూజా హెగ్డే కామెంట్స్

By

Published : Mar 19, 2022, 11:54 AM IST

pooja hegde comments on destiny: విధిరాత నుంచి ఎవరూ తప్పించుకోలేరంటూ జాతకాలపై తన అభిప్రాయాన్ని బయటపెట్టింది పూజా హెగ్డే. మనుషులకే కాదు సినిమాలకూ విధిరాత ఉంటుందని నమ్ముతానని అంటోంది ఈ ముద్దుగుమ్మ. కొన్నిసార్లు ఫర్వాలేదు అనుకున్న సినిమాలు.. బాక్సాఫీస్​ దగ్గర బాగా కలెక్షన్లు రాబడతాయని... చాలా బాగుంది అనుకున్న సినిమాలకు కొన్నిసార్లు... కలెక్షన్​లు పెద్దగా రావని చెప్పుకొచ్చింది.

అదేసమయంలో రాధేశ్యామ్​లో తన పెర్​ఫార్మెన్స్ పట్ల సంతోషంగా ఉన్నట్లు చెప్పింది పూజా.

''సినిమాలో నన్ను జనాలు చూసి ఆదరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. పూజా హెగ్డే అందంగా కనిపిస్తోందని చెబుతున్నారు. నా పెర్‌ఫార్మెన్స్‌ గురించి మాట్లాడుకుంటున్నారు. నాకు చాలా ఆనందంగా ఉంది. థియేటర్ నుండి జనాలు బయటకు వచ్చినా ప్రేరణ పాత్ర వారితోనే ఉండిపోతుంది" అని పూజా చెప్పుకొచ్చింది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి పూజాహెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తోంది. తెలుగుతో పాటు వివిధ భాషల్లో విడుదలైన ఈ సినిమాని జాతకాలు, విధిరాత నేపథ్యంలో రూపొందించారు. ఇందులో ప్రభాస్ హస్తసాముద్రికుడిగా కనిపించగా, ఆయన ప్రేయసి ప్రేరణ పాత్రలో పూజా హెగ్డే ఆకట్టుకుంది. రాధాకృష్ణ దర్శకత్వంలో రూ. 350 కోట్ల బడ్జెట్​తో ఈ సినిమా తెరకెక్కింది.

రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కస్‌లో పూజా కనిపించనుంది. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సరసన పూజా నటిస్తోంది.

ఇదీ చదవండి:'రాజమౌళి వల్లే మా సీక్రెట్​ ప్రపంచానికి తెలిసింది'

ABOUT THE AUTHOR

...view details