తెలంగాణ

telangana

పూజాహెగ్డే ఉదారత.. 100 కుటుంబాలకు సాయం!

By

Published : Jun 1, 2021, 6:50 PM IST

కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు తన వంతు సాయం చేశారు స్టార్​ హీరోయిన్​ పూజాహెగ్డే. 100 నిరుపేద కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకుల్ని అందించి.. తన ఉదారత చాటుకున్నారు.

Pooja Hegde arranges food a month's rations for a 100 families
పూజాహెగ్డే ఉదారత.. 100 కుటుంబాలకు సాయం!

కొవిడ్ సంక్షోభం వ‌ల్ల ఆర్థిక ఇబ్బందులు ప‌డుతోన్న వారికి త‌న‌వంతు సాయంగా నిలిచారు ప్ర‌ముఖ నటి పూజా హెగ్డే. లాక్‌డౌన్ కార‌ణంగా స‌మస్య‌లు ఎదుర్కొంటున్న పేద కుటుంబాల‌కు అండ‌గా నిలిచారు. 100 కుటుంబాల‌కు నెల‌కు స‌రిప‌డా స‌రుకుల్ని అందించి, త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. వాట‌న్నింటిని త‌నే స్వ‌యంగా ప్యాక్ చేశారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైర‌ల్ అవుతున్నాయి.

నిత్యావసర సరుకులను ప్యాక్​ చేస్తోన్న పూజాహెగ్డే

ఈ ఫొటోలను చూసిన నెటిజ‌న్లు, పూజా అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. క‌రోనా బారిన ప‌డిన పూజా ఇటీవ‌లే కోలుకున్నారు. కొవిడ్ పాజిటివ్ వ‌చ్చినంత మాత్రాన భ‌య‌ప‌డ‌కూడ‌ద‌ని, ఆక్సీమీట‌ర్ ఎలా ప‌డితే అలా వాడ‌కూడ‌ద‌ని ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా కొన్ని వీడియోలు రూపొందించి ఇతరులలో దైర్యాన్ని నింపుతున్నారు పూజా.

నిత్యావసర సరుకులను ప్యాక్​ చేస్తోన్న పూజాహెగ్డే

పూజా హెగ్డే.. ప్రస్తుతం ప్ర‌భాస్ స‌ర‌స‌న 'రాధేశ్యామ్', రామ్​చ‌ర‌ణ్ స‌ర‌స‌న 'ఆచార్య‌'లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. అఖిల్‌తో క‌లిసి ఆమె న‌టించిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్' విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.

ఇదీ చూడండి:pooja hegde: రణ్​వీర్ నుంచి అది దొంగిలిస్తా!

ABOUT THE AUTHOR

...view details