Pooja Hegde Appreciates Samantha: పూజా హెగ్డే, సమంత.. దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్లుగా రాణిస్తోన్న ముద్దుగుమ్మలు. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో వరుస ప్రాజెక్ట్‌లు చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. కెరీర్‌లో దూసుకెళ్తోన్న ఈ భామల మధ్య గతంలో స్వల్ప మనస్పర్థలు తలెత్తాయి. సామ్‌ని విమర్శించేలా పూజాహెగ్డే ఇన్‌స్టా నుంచి వచ్చిన ఒక పోస్ట్ అప్పట్లో నెట్టింటిని షేక్ చేసింది. తన ఇన్‌స్టా హ్యాక్ అయ్యిందని పూజా వివరణ ఇచ్చినప్పటికీ వారి అభిమానుల మధ్య వాగ్వాదం నడిచింది. ఆనాటి నుంచి పూజా-సామ్‌ల మధ్య మాటల్లేవని నెటిజన్లు అభిప్రాయానికి వచ్చేశారు. ఇదిలా ఉండగా, తాజాగా సామ్-పూజాలు చేసిన పనితో వారి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సమంతను ప్రశంసిస్తూ పూజా హెగ్డే పోస్ట్.. - పూజాహెగ్డే న్యూస్
Pooja Hegde Appreciates Samantha: పూజాహెగ్డే ప్రధాన కథానాయికగా నటిస్తున్న 'బీస్ట్' సినిమాలో 'అరబిక్ కుత్తు' పాటకు సమంత డ్యాన్స్ చేసి ఆ రిథమ్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. కాగా, ఈ వీడియో చూసిన పూజాహెగ్డే ఎంతో ఆనందించారు. సామ్ డ్యాన్స్ వీడియోని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. "అద్భుతం" అని మెచ్చుకున్నారు. గతంలో ఈ భామల మధ్య స్వల్ప మనస్పర్థలు తలెత్తగా.. తాజా పరిణామాలతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Samantha News: ఎనిమిదేళ్ల తర్వాత పూజాహెగ్డే కోలీవుడ్‌లో నటిస్తున్నారు. విజయ్ కథానాయకుడిగా నటిస్తున్న 'బీస్ట్'లో లీడ్ రోల్ పోషించారు. తాజాగా ఈ సినిమా నుంచి 'అరబిక్ కుత్తు' పాట విడుదలై సూపర్ హిట్ అందుకుంది. 5 కోట్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకెళ్తోన్న ఈ పాటకు సమంత తాజాగా డ్యాన్స్ చేశారు. లేట్ నైట్ ప్రయాణం చేస్తోన్న ఆమె ఎయిర్‌పోర్ట్‌లో 'అరబిక్ కుత్తు'కు డ్యాన్స్ చేసి ఆ పాట రిథమ్‌ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పారు. సాంగ్ సూపర్‌గా ఉందని 'బీస్ట్' టీమ్‌ని ప్రశంసించారు. కాగా, ఈ వీడియో చూసిన పూజాహెగ్డే ఎంతో ఆనందించారు. సామ్ డ్యాన్స్ వీడియోని ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ.. "అద్భుతం" అని మెచ్చుకున్నారు.
ఇదీ చదవండి:'ఆడవాళ్లు మీకు జోహార్లు'.. ట్రైలర్ తేదీ ఫిక్స్..!