తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దానికి ఎంతోకాలం పట్టలేదు: హీరోయిన్ పూజాహెగ్డే - pooja hegde movies

Pooja hege tollywood: టాలీవుడ్​ను అర్థం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదని హీరోయిన్ పూజాహెగ్డే చెప్పింది. సినిమా ప్రత్యేకత అదేనంటూ పేర్కొంది.

pooja hegde
పూజాహెగ్డే

By

Published : Jan 15, 2022, 7:34 AM IST

Pooja hegde movies: హీరోయిన్ల పాలిట తెలుగుతెర ఓ పుష్పకవిమానం. ఎంతమంది వచ్చినా మరొకరికి చోటు ఇస్తూనే ఉంటుంది. అయితే తెలుగు ప్రేక్షకులు తమ కథానాయిక అని సొంతం చేసుకొనేంతగా ప్రభావం చూపే భామలు మాత్రం అరుదు. అగ్ర కథానాయిక పూజాహెగ్డే అయితే తెలుగమ్మాయిలాగే మారిపోయింది. తెలుగు పలుకులతో తన పాత్రలకు తెలుగుదనాన్ని ఒలికిస్తున్నారు. అందుకే ఆమెని వరుసగా అవకాశాలు వరిస్తున్నాయి. గతేడాది నాకు తెలుగు ప్రేక్షకుల అభిమానం మరింతగా హృదయాన్ని తాకిందని చెబుతోంది పూజ. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలపై నాకు ఎప్పుడో గురి ఏర్పడిందని చెబుతోంది పూజ.

"తెలుగు వాతావరణాన్ని అర్థం చేసుకోవడానికి నాకు ఎంతో కాలం పట్టలేదు. నేను కన్నడ అమ్మాయిని కావడంతోనేమో. కొన్నిసార్లు మేం వినే కథలు, చేసే పాత్రలే.. సంస్కృతి సంప్రదాయాలు అర్థమయ్యేలా చేస్తాయి. సినిమా ప్రత్యేకత అదే" అని చెప్పుకొచ్చింది పూజ. ఈ ఏడాది ఆమె వివిధ భాషల్లో చేసిన ఐదు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

పూజాహెగ్డే

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details