తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సామజవరగమన.. ఈఫిల్ ట‌వ‌ర్‌కు త‌క్కువేం కాదు' - లిడో డ్యాన్సర్లతో అల్లు అర్జున్-పూజా హెగ్డే

అల వైకుంఠపురంలోని 'సామజవరగమన' గీతాన్ని పారిస్​లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా అందుకు సంబంధించిన ఓ ప్రత్యేక విషయం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

అల్లు అర్జున్-పూజా హెగ్డే

By

Published : Nov 10, 2019, 5:31 AM IST

అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న 'అల.. వైకుంఠ‌పుర‌ములో' సినిమాలోని 'సామజవరగమన' పాట సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. ఇప్పటికే సామాజిక మాధ్య‌మాల్లో ప‌లు రికార్డుల్ని సొంతం చేసుకుంది. విన‌డంలోనేకాదు, చిత్రీక‌ర‌ణ ప‌రంగానూ ఈ గీతం వెన‌ుక ఎన్నో ప్ర‌త్యేక‌త‌లున్నాయి.

పారిస్‌లోని లిడో డాన్స‌ర్ల నేప‌థ్యంలో ఈ పాటను షూట్ చేశారు. వైవిధ్యమైన అలంకార దుస్తులకు ఈ డాన్సర్లు పెట్టింది పేరు. 25 ఏళ్లుగా ఆ ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నారు. వాళ్ల‌తో క‌లిసి ఆడిపాడిన తొలి దక్షిణాది స్టార్ అల్లు అర్జున్ కావడం విశేషం.

లిడో డ్యాన్సర్లతో అల్లు అర్జున్-పూజా హెగ్డే

హీరోయిన్ పూజా హెగ్డే.. ఈ పాట గురించి గొప్ప‌గా చెబుతూ ట్వీట్ చేసింది. ఈఫిల్ ట‌వ‌ర్‌కు ఏమాత్రం తీసిపోని గీతం ఇదంటూ.. అక్క‌డే అల్లు అర్జున్‌తో క‌లిసి దిగిన ఫొటోను ట్విట్టర్​లో పంచుకుంది.

ఈ సినిమాకు తమన్ సంగీతమందిస్తున్నాడు. త్రివిక్రమ్ దర్శకుడు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌వ‌న‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ABOUT THE AUTHOR

...view details