సినీ తారలు నిత్యం చిత్రీకరణలతో ఎంత హడావిడిగా ఉంటారో అందరికీ తెలిసిందే. తీరిక లేని సమయాల్లోనూ ఇంట్లో పండగలు ఎలా జరుపుకొంటారని పూజా హెగ్డేను అడగగా ఇలా జవాబు చెప్పుకొచ్చింది.
"నేను ముంబయిలో పుట్టిపెరిగా. కానీ మా ఇంట్లో మొత్తం దక్షిణాది వాతావరణమే కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో చేసే పండగలన్నింటినీ వేడుకగా జరుపుకొంటాం. సంక్రాంతి అనగానే నాకు మొదటగా మా అమ్మ చేసే లడ్డూలే గుర్తుకు వస్తుంటాయి. కానీ గాలిపటాలతో సరదాగా ఆడుకున్నది తక్కువనే చెప్పాలి. ఇక దసరా నవరాత్రుల్లోనైతే మా ఇంట్లో భజన ఉంటుంది. నేను షూటింగ్ కారణంగా ఎక్కడున్నా సరే ఆ తొమ్మిది రోజులు ఉదయం పూట భజన చేస్తుంటా. సినిమాల వల్ల పండగల పూట ఇంటికి దూరంగా గడపాల్సి వస్తోంది. కానీ వీలు చిక్కితే వెంటనే ఇంట్లో వాలిపోతా"