తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సినిమా సినిమాకూ ప్రేమ పెరుగుతోంది' - తెలుగు సినిమా వార్తలు

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి వరుస అవకాశాలతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్​లో జోరు చూపిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్ తొలినాళ్లలో సెట్​కి ఎపుడు వెళ్తానా అని ఆసక్తిగా ఎదురుచూసేదాన్నని వెల్లడించింది.

Pooja Hedge about his career
'సినిమా సినిమాకూ ప్రేమ పెరుగుతోంది'

By

Published : Sep 24, 2020, 8:51 AM IST

కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి వరుస అవకాశాలతో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్​లో జోరు చూపిస్తోంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. కెరీర్ తొలినాళ్లలో సెట్​కి ఎపుడు వెళ్తానా అని ఆసక్తిగా ఎదురుచూసేదాన్నని వెల్లడించింది. ఈ ప్రేమ సినిమాసినిమాకూ పెరుగుతూనే ఉందని తెలిపింది.

"ఇష్టమైన రంగంలోకి వచ్చినప్పుడు కష్టాలు, ఇబ్బందులు ఏం ఉంటాయి చెప్పండి. చిత్రసీమకు వచ్చిన కొత్తలో రోజూ సెట్‌కు ఎప్పుడెప్పుడు వెళ్తానా? అని ఎదురు చూస్తుండేదాన్ని. 'సెట్లో ఈరోజు కొత్తగా ఏం నేర్చుకుంటానా?' అని ఆసక్తితో చూసేదాన్ని. పని తప్ప మరో వ్యాపకం ఉండేది కాదు. ఈ ప్రేమాసక్తులు సినిమా సినిమాకూ పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు. వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నా.. ఏమాత్రం అలసటలేకుండా ఉత్సాహంగా పని చేసుకుంటూ వెళ్తున్నానంటే అదే కారణం" అని చెప్పుకొచ్చింది పూజ.

ABOUT THE AUTHOR

...view details