తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మణిరత్నం కొత్త సినిమా షెడ్యూల్ శ్రీలంకలో? - శ్రీలంకలో పొన్నియన్ సెల్వన్ షూటింగ్

స్టార్ డైరెక్టర్ మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్​' చిత్రం కొత్త షెడ్యూల్​ కోసం త్వరలో శ్రీలంక వెళ్లనున్నారట. దాదాపు నెలరోజుల పాటు అక్కడి అడవుల్లో షూటింగ్ చేయనున్నారని సమాచారం.

మణిరత్నం కొత్త సినిమా షెడ్యూల్ శ్రీలంకలో?
దర్శకుడు మణిరత్నం

By

Published : Sep 4, 2020, 2:21 PM IST

ప్రేమకథా చిత్రాలతో పాటు సమాకాలీన సంఘటనలు ఆధారంగా వైవిధ్య చిత్రాలు తీస్తుంటారు దర్శకుడు మణిరత్నం. ఆయన ప్రస్తుతం తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం 'పొన్నియన్‌ సెల్వన్‌'. ఇప్పటికే సినిమా తొలి షెడ్యూల్‌ థాయ్‌ల్యాండ్‌ జరుపుకుంది. అనంతరం కరోనా ప్రభావంతో షూటింగ్‌ వాయిదా పడింది.

ఐదు నెలల తర్వాత తిరిగి సినిమా షూటింగ్‌ ప్రారంభించేందుకు చిత్రబృందం సిద్ధమైంది. కొన్ని సన్నివేశాలు అడవుల్లో చిత్రీకరించాల్సి ఉన్నందున శ్రీలంకలో చిత్రీకరణ చేయాలని భావిస్తోంది. నెలపాటు సాగే ఈ షెడ్యూల్ కోసం సెప్టెంబర్‌ 20న ఆ దేశానికి వెళ్లనున్నారట.

'పొన్నియన్ సెల్వన్​' సినిమా పోస్టర్

మద్రాస్‌ టాకీస్‌, లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, త్రిష, ఐశ్యర్య లక్ష్మి, కార్తి, విక్రమ్‌ ప్రభు, శోభిత ధూళిపాళ్ల, శరత్‌ కుమార్‌, అదితీరావు హైదరి తదితరులు నటిస్తున్నారు. ప్రత్యేక పాత్రలో కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కనిపించనున్నారు. ఏ.ఆర్.రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details