తెలంగాణ

telangana

ETV Bharat / sitara

థాయ్‌లో షూటింగ్‌ పూర్తి చేసుకున్న 'పొన్నియన్‌ సెల్వన్‌' - పొన్నియన్ సెల్వన్ షూటింగ్ పూర్తి

ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న చారిత్రక చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. తాజాగా ఈ సినిమా థాయ్​లాండ్​లో షూటింగ్​ను పూర్తి చేసుకుంది.

ponniyan
ponniyan

By

Published : Jan 10, 2020, 7:12 PM IST

సామాజిక, రాజకీయ, ప్రేమకథలను ఏక కాలంలో ఒకే కథలో చెప్పగల గొప్ప దర్శకుడు మణిరత్నం. తాజాగా ఇతడు చోళరాజుల నేపథ్యంలో 'పొన్నియన్‌ సెల్వన్‌' అనే చారిత్రక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను థాయ్‌లాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. గతేడాది డిసెంబర్‌ రెండో వారంలో షూటింగ్‌ షెడ్యూల్‌ ప్రారంభమై ఈ మధ్యనే పూర్తి చేసుకుంది. తిరిగి చిత్రబృందం చెన్నైకి చేరుకుంది.

కల్కి కృష్ణమూర్తి నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మద్రాసు టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిత్రంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్, కీర్తి సురేష్, కార్తీ, జయం రవి నటిస్తుండగా, మోహన్‌బాబు ఓ ప్రధాన పాత్రలో కనపించనున్నాడు. ఏ.ఆర్‌.రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకులను అలరించనుంది. ప్రధానంగా తెలుగు, తమిళ, హిందీలో విడుదల కానుంది.

పొన్నియన్‌ సెల్వన్‌

ఇవీ చూడండి.. అందుకే కుటుంబ కథలు చేస్తున్నా: త్రివిక్రమ్

ABOUT THE AUTHOR

...view details