తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మహేశ్​కు పోటీగా బన్నీ టీమ్​ సంగీత విభావరి

'సరిలేరు నీకెవ్వరు', 'అలవైకుంఠపురములో' చిత్రబృందాలు ఒకరిమీద ఒకరు పోటీగా ప్రచారకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాల్లోని పాటలు, ప్రోమోలు, లిరికల్​ సాంగ్​లకు ప్రజల్లో మంచి స్పందన లభించింది. ఇటీవల హైదరాబాద్​ వేదికగా జనవరి 5న జరగనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చిరంజీవిని ఆహ్వానించింది మహేశ్​ చిత్రబృందం. తాజాగా పలువురు సినీ హీరోలతో 6న సంగీత విభావరికి సిద్ధమౌతోంది అల్లుఅర్జున్​ టీం.

AVLPMusicalConcerton in Hyderabad on 6thJan2020
మహేశ్​ సినిమాకు పోటీగా బన్నీ టీం వినూత్న విభావరి...

By

Published : Jan 4, 2020, 5:51 PM IST

Updated : Jan 4, 2020, 8:48 PM IST

టాలీవుడ్‌లో సంక్రాంతి సందడి అప్పుడే మొదలైపోయింది. స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌, సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన చిత్రాలు విడుదలకు సిద్ధం కావడం వల్ల అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సంక్రాంతి పండుగ కానుకగా రావాల్సిన వీరిద్దరి చిత్రాల విడుదల తేదీల్లో.. మార్పులు ఉంటాయాని ఇప్పటికే వార్తలు వచ్చాయి. తాజాగా రెండు సినిమాల మధ్య పోటీ ఉందని పరోక్షంగా బహిర్గతం చేస్తూనే... ప్రచారాల్లోనూ పోటీ పడుతున్నారు.

పోటాపోటీ...

అల్లు అర్జున్‌ - త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో..'. పూజాహెగ్డే కథానాయిక. అల్లు అరవింద్‌, రాధాకృష్ణ నిర్మాతలు. ఈ సినిమాకు తమన్​ సంగీత దర్శకుడు. సామజవరగమన పాట ఫిమేల్​ కవర్​ను శ్రేయా ఘోషల్​ చేత పాడించారు.

ఈ నెల 6న హైదారాబాద్​లోని యూసఫ్​గూడ పోలీస్​ గ్రౌండ్​లో సంగీత విభావరి ఏర్పాటు చేస్తోంది చిత్రబృందం. దీనికి పలువురు సినీ తారలు హాజరుకానున్నారు. అంతేకాకుండా పలువురు ప్రముఖ సింగర్​లు లైవ్​ ప్రదర్శన చేయనున్నారు.

అలవైకుంఠపురములో చిత్రబృందం నిర్వహిస్తున్న సంగీత విభావరి

మహేశ్‌బాబు - అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'సరిలేరునీకెవ్వరు'. దిల్‌రాజు, అనిల్‌ సుంకర, మహేశ్‌బాబు నిర్మాతలు. రష్మిక కథానాయిక. దేవీశ్రీ ప్రసాద్​ సంగీతం సమకూర్చాడు. ఇటీవల విశాఖ ఉత్సవ్​లో పాట ప్రోమోను అభిమానుల సమక్షంలో విడుదల చేశారు. ఈ నెల 5న హైదారాబాద్​లోని ఎల్బీ స్టేడియం వేదికగా జరగనున్న ప్రీ రిలీజ్​ ఈవెంట్​కు చిరంజీవిని ఆహ్వానించింది మహేశ్​ చిత్రబృందం.

పోస్టర్లపై తేదీలెక్కడ..?

మొదట ఈ రెండు చిత్రాలను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయాలనుకున్నారు. కానీ, తెలుగు చిత్ర నిర్మాతల సంఘం సూచన మేరకు రెండు చిత్రాల విడుదల తేదీల్లో మార్పులు చేశారు. ఫలితంగా 'అల..వైకుంఠపురములో' జనవరి 12న విడుదలకు సిద్ధం కాగా, 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న విడుదల కానున్నట్లు ప్రకటించారు. కానీ ఆ తేదీలను ఖరారు చేయకుండా రెండు సినిమా బృందాలు పోస్టర్లను విడుదల చేయడం వల్ల సందిగ్ధం ఏర్పడింది.

Last Updated : Jan 4, 2020, 8:48 PM IST

ABOUT THE AUTHOR

...view details