కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినందుకు కేరళ ప్రముఖ నటుడు మమ్ముట్టితో పాటు మరో 300 మందిపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. వారిలో మరో నటుడు రమేశ్ పిషరోడీ కూడా ఉన్నారు.
ప్రముఖ నటుడు మమ్ముట్టిపై కేసు.. కారణం ఏంటంటే? - మమ్ముట్టి అప్డేట్స్
ప్రముఖ మలయాళీ నటుడు మమ్ముట్టిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిపారు.
![ప్రముఖ నటుడు మమ్ముట్టిపై కేసు.. కారణం ఏంటంటే? Mammootty news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12715945-thumbnail-3x2-img.jpg)
మమ్ముట్టిపై కేసు
కోజికోడ్‌లో ఈ నెల 3న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రోబో సాంకేతికత ఆధారంగా కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స సేవల ప్రారంభోత్సవానికి మమ్ముట్టి, రమేశ్ అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా తరలివచ్చారు. కొవిడ్ నిబంధనల ప్రకారం ఇంతమంది గుమికూడటానికి అనుమతి లేదు. అందువల్ల కేరళ మహమ్మారి వ్యాధుల చట్టం కింద వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు.
ఇదీ చదవండి:శారద మరణించినట్లు సోషల్ మీడియాలో వార్తలు.. అసలేమైంది?