ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన 'పీఎమ్ నరేంద్రమోదీ' ట్రైలర్ విడుదలైంది. ఇందులో మోదీ పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.
"ఓ మామూలు ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని అవుతాడా" - movie
'పీఎమ్ నరేంద్రమోదీ' చిత్ర ట్రైలర్ విడుదలైంది. మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
చిత్రంలో వివేక్ ఒబెరాయ్ మోదీ పాత్ర కోసం చాలా కష్టపడ్డాడని ట్రైలర్ చూస్తేనే తెలుస్తోంది. "ఓ సాధారణ ఛాయ్‌వాలా దేశానికి ప్రధాని అవుతాడా" అంటూ సాగే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. మోదీ చిన్నతనం నుంచి ప్రస్తుత రాజకీయ ప్రస్థానం వరకు ఉన్న ముఖ్య అంశాలను తెరకెక్కించారు. "భారతదేశానికి స్వాతంత్ర్యంవచ్చినా మనం ఇంకా భారతీయులం కాలేకపోయాం" అనే డైలాగ్‌తో వివేక్ అలరించాడు. “ఇప్పటి వరకు మా బలిదానాలనే చూశారు... ఇప్పడు మా ప్రతీకారాన్ని చూడండి” అంటూ ప్రస్తుత సంఘటనలను కళ్లకు కట్టింది ట్రైలర్.
ఈ చిత్రంలో అమిత్ షా పాత్రలో మనోజ్ జోషి నటిస్తుండగా, బొమన్ ఇరానీ రతన్ టాటా పాత్ర పోషిస్తున్నాడు. సురేశ్ ఒబెరాయ్ , సందీప్ సింగ్ తదితరులు ఈ సినిమాకు నిర్మాతలు.