Tanzania siblings reels: టిక్ టాక్.. ఒకప్పుడు ఇదొక సంచలనం. మొబైల్లో తప్పని సరి అప్లికేషన్. దాదాపు దేశంలోని 80శాతం మంది ఈ అప్లికేషన్‌కు కస్టమర్లు ఉన్నారు. అందులో ఎక్కువ శాతం టిక్ టాక్ విడియోలకు అభినయించేవారు. అనంతరం చైనా వ్యవహారంలో ఆ దేశానికి చెందిన టిక్ టాక్ అప్లికేషన్ ను భారత్ బ్యాన్ చేసింది. అ తర్వాత ఫేస్ బుక్ సంస్థకు చెందిన ఇన్‌స్టాగ్రామ్...రీల్స్ అనే ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఇన్‌స్టాగ్రామ్ అందుబాటులో ఉంది. రోజుకు కొన్ని కోట్ల విడియోలు అందలో డంప్ అవుతుంటాయి. కొత్తదనంగా ఏ వీడియో కనిపించినా అది ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. తాజాగా అల్లు అర్జున్ నటించిన పుష్ప లోని డైలాగ్ లు, పాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. పలు దేశాల పౌరులు, క్రికెటర్లు, ప్రముఖులు వాటికి రీల్స్ చేశారు.
తెలిసిన భాషకు రీల్స్‌లో అభినయించాలంటే సులభంగానే ఉంటుంది. అదే తెలియని ప్రాంతం, భాష, రిథమ్ అయితే ఆ రీల్స్ కి లిప్ సింక్, నృత్యం చేయడం చాలా కష్టం. కానీ ప్రస్తుతం భారత్ లో విడుదల అవుతున్న సినిమాలు, అందులోని సంభాషణలు, పాటలపై విదేశీయులు తెగ ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా సరే రిథమ్ బాగుంటే చాలు భారతీయులతో పాటు విదేశీయులు కూడా పోటీగా రీల్స్ చేస్తున్నారు. అలాంటి వారే టాంజానియాకు చెందిన అక్కాతమ్ముళ్ళు కిలి పాల్, నీమ పాల్. ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వీరు సంచలనం. కిలి పాల్ కు 2.6మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
సన్మానం
టాంజానియా మాసాయి తెగకు చెందిన ఈ అక్కా తమ్ముళ్ళు స్థానికంగా వ్యవసాయ పనులకు వెళుతుంటారు. స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసిన తర్వాత...తొలుత స్థానిక భాషల్లో టిక్ టాక్ వీడియోలు చేశారు. టిక్ టాక్ బ్యాన్ అవ్వడం వల్ల ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేయడం ప్రారంభించారు. ఒకసారి మెలోడి సాంగ్ కోసం వెతకగా బాలీవుడ్ నటుడు సిద్దార్ధ మల్హోత్రా నటించిన షేర్షా సినిమాలో జెబిన్ నాట్యుల్ ఆలపించిన రాతాన్....లంబియా లంబియా రే... అనే పాట నచ్చడం వల్ల ఆ పాటకు పెదవులు ఆడించారు. అచ్చం పాటలాగానే సింక్ చేశారు. దీనిని ఆ సినిమా కథానాయిక కియారా అడ్వాణీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం వల్ల అది వైరల్‌గా మారింది. భారత్‌లో విపరీతంగా వైరల్ కావడం వల్ల వారిద్దరికీ ఫాలోవర్లు పెరిగారు. దీంతో అన్ని పాపులర్ పాటలకు డబ్ చేస్తూ వీడియోలు చేయడం ప్రారంభించారు.