బాలీవుడ్లో వరుణ్‌ధావన్ హీరోగా రూపొందుతున్న 'కూలీ నెంబర్.1' చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సినిమా షూటింగ్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నట్లు హీరో వరుణ్ చేసిన ట్వీట్‌పై స్పందించారు.
"భారత్ ప్లాస్టిక్ రహిత దేశంగా మార్చాలనే ప్రధాని మోదీ పిలుపు ప్రతి ఒక్కరికి ఆచరణీయం. మనం చేసే చిన్న పనుల ద్వారా ఇది సాధించవచ్చు. 'కూలీ నెంబరు1' సెట్లో ప్లాస్టిక్ బదులు స్టీలు బాటిళ్లు వాడాలని నిర్ణయం తీసుకున్నాం" -హీరో వరుణ్ ధావన్ ట్వీట్
"కూలీ నెం.1' బృందం మంచి నిర్ణయం తీసుకుంది. ఒక్కసారి వాడిపడేసే ప్లాస్టిక్ నుంచి భారత్‌ను రక్షించేందుకు సినీ ప్రపంచం అడుగులు వేయడం ఆనందంగా ఉంది." -ట్విట్టర్లో ప్రధాని మోదీ