ప్రధాని నరేంద్రమోదీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'పీఎం నరేంద్ర మోదీ' చిత్రానికి సుప్రీం కోర్టులో స్వల్ప ఊరట లభించింది. విడుదలను నిలిపివేయాలంటూ ఓ కాంగ్రెస్ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది సుప్రీంకోర్టు.
సెన్సార్ బోర్డు పరిశీలనకే పోని చిత్రంపై ముందస్తు వ్యాజ్యం దాఖలు చేశారని తెలిపింది కోర్టు. ఏప్రిల్ 11న చిత్రం విడుదలైతే ఎన్నికల సంఘం నుంచి కక్షిదారు నష్ట నివారణ చర్యలు కోరవచ్చని తెలిపింది.