తెలంగాణ

telangana

ETV Bharat / sitara

దేశభక్తి సినిమాలకు కేరాఫ్​గా మారిన విక్కీ కౌశల్​​ - biopics

ఇద్దరు ప్రముఖ వ్యక్తుల బయోపిక్స్​లో నటిస్తున్నాడు బాలీవుడ్​ హీరో విక్కీ కౌశల్. సర్దార్​ ఉద్ధమ్ సింగ్, 1971 యుద్ధ హీరో శ్యామ్ మనేక్షా బయోపిక్స్​తో ముందుకు రానున్నాడు. ఈ పాత్రలు పోషించడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపాడు ఈ యువ హీరో.

విక్కీ కౌశల్

By

Published : Jul 29, 2019, 5:36 AM IST

ఈ ఏడాది 'ఉరీ' చిత్రంతో అఖండ విజయాన్ని అందుకున్నాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. అదే జోరులో మరో రెండు బయోపిక్స్​లో నటిస్తున్నాడీ యువ నటుడు. స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉద్ధమ్​సింగ్, యుద్ధ హీరో ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మనేక్షా బయోపిక్స్​లో నటిస్తున్నాడు. ఈ పాత్రలను పోషించడం వల్ల బాధ్యత మరింత పెరిగిందని తెలిపాడు విక్కీ.

"షూజిత్ సర్కార్ దర్శకత్వంలో నటించడం నా కల. ఆ అవకాశం షాహిద్ ఉద్ధమ్ సింగ్​తో వచ్చింది. ఇదే సమయంలో బాధ్యత మరింత పెరిగింది" - విక్కీ కౌశల్, బాలీవుడ్ హీరో.

1919, ఏప్రిల్ 19న జరిగిన జలియన్​వాలాబాగ్​ ఘటనకు కారకుడైన డయ్యర్​ను ఇంగ్లాండ్​లో చంపి ప్రతీకారం తీర్చుకున్నాడు ఉద్ధమ్ సింగ్​. ప్రస్తుతం ఆయన పాత్రనే విక్కీ కౌశల్ పోషిస్తున్నాడు.

శ్యామ్ మనేక్షా బయోపిక్​ను మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్నారు. భవాని అయ్యర్ కథను అందించారు.

"శ్యామ్ మనేక్షా గురించి చిన్నతనంలో నా తల్లిదండ్రులు చెబుతుంటే విన్నా. వాళ్లు పంజాబ్​లో ఉండేవాళ్లు. 1971 యుద్ధాన్ని దగ్గర నుంచి చూశారు. సినిమాకు సంబంధించిన స్క్రిప్టు చదువుతుంటే ఒళ్లు గగుర్పొడిచింది. నిజంగా ఆయన (శ్యామ్ మనేక్షా) గొప్ప వీరుడు. ఆయన పాత్రలో నటించడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా" - విక్కీ కౌశల్, బాలీవుడ్ హీరో.

ఈ రెండు సినిమాల్లో స్వతంత్ర సమరయోధుల పాత్రల్లో నటిస్తున్నాడు విక్కీ కౌశల్​. నటుడిగా కథల ఎంపిక ముఖ్యమని.. ఒకే విధమైన పాత్రలను ఎంచుకోకూడదని అంటున్నాడీ ఉరీ హీరో.

"ఓ నటుడు కథలు ఎంచుకునేటప్పుడు అవి దేశభక్తి చిత్రాలైనా.. ఒకే విధమైన పాత్రలకోసం చూడకూడదు. అది మంచి కథైతే ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా చేయాల్సిందే" -విక్కీ కౌశల్​, బాలీవుడ్ నటుడు

'మసాన్' చిత్రంతో బాలీవుడ్​లో తొలి విజయాన్ని అందుకున్నాడు విక్కీ కౌశల్. రామన్ రాఘవ్, రాజీ, లస్ట్​ స్టోరీస్, సంజూ, ఉరీ లాంటి చిత్రాలతో తక్కువ కాలంలోనే వైవిధ్య సినిమాల హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇది చదవండి: ''అనగనగా ఒకరోజు'కు మొదట డైరక్టర్ నేనే'

ABOUT THE AUTHOR

...view details