కరోనాతో పోరాడుతున్న ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం నిలకడగా ఉందని ఎమ్జీఎమ్ ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసి ఈ విషయాన్ని చెప్పారు. ఎక్మో సహాయంతో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉంచినట్లు తెలిపారు.
నిలకడగానే గాయకుడు ఎస్పీ బాలు ఆరోగ్యం - Playback singer SP Balasubrahmanyam
సింగర్ ఎస్పీ బాలు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. ఎక్మో సహాయంతో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
ఎస్పీ బాలు
యూకే, యూఎస్‌లోని అంతర్జాతీయ నిపుణులతో బాలు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని మల్టీడిసిప్లెనరీ బృందం తెలిపింది. ఎక్మో సహాయం గురించి వారితో మాట్లాడుతున్నామని తెలిపింది.
కరోనా సోకడం వల్ల ఆగస్టు 5న బాలు ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం కొన్నిసార్లు విషమంగా, కొన్నిసార్లు నిలకడగా మారుతూ వస్తోంది. ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని దక్షిణాది సినీ ప్రముఖులు ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రార్థిస్తున్నారు.