తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేహా కక్కర్ ప్రెగ్నెంట్.. నిజమేనా? - బాలీవుడ్​ గాయనీగాయకులు

ఈ ఏడాది అక్టోబర్​లో పెళ్లి చేసుకున్నారు బాలీవుడ్​ గాయనీగాయకులు నేహా కక్కర్​-రోహన్ ప్రీత్​ సింగ్​. అంతలోనే నేహా గర్భం దాల్చినట్లుగా ఓ పోస్టు పెట్టింది. మరి వారిద్దరూ నిజంగానే.. తల్లిదండ్రులు కాబోతున్నారా?

Playback singer Neha Kakkar's post on Instagram has set off rumour mills, leading to speculation about her pregnancy.
ఆ జంట.. నిజంగానే తల్లీతండ్రులు కాబోతున్నారా?

By

Published : Dec 18, 2020, 1:50 PM IST

బాలీవుడ్​ గాయని నేహా కక్కర్.. తన అభిమానులను గందరగోళానికి గురిచేసింది. ఇన్​స్టాగ్రామ్​లో తన భర్త రోహన్​ ప్రీత్​ సింగ్​తో కలిసి తాను గర్భం ధరించినట్లుగా ఉన్న ఓ ఫొటోను షేర్​ చేసింది. ఇదే ఫొటోను తన భర్త రోహన్​ షేర్​ చేస్తూ..'ఇప్పటి నుంచి నువ్వు మరింత జాగ్రత్తగా ఉండాలి' అని రాసుకొచ్చాడు.

నేహా కక్కర్​-రోహన్ ప్రీత్​ సింగ్

ఈ ఫొటోలను చూసి నేహా​ నిజంగానే గర్భం దాల్చిందేమోనని అనుకున్నారు నెటిజన్లు. కానీ, ఓ మ్యూజిక్​ ఆల్బమ్ కోసమే ఇలా ఆ ఫొటోను షేర్​ చేసినట్లు తెలుస్తోంది. ​

ఓ పెళ్లికి సంబంధించిన మ్యూజిక్​ వీడియో చేసిన అనంతరం వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం విశేషం. కాగా.. కక్కర్​ ప్రస్తుతం ఇండియన్​ ఐడల్​ 12వ సీజన్​కు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి:'కల్యాణ్ బాబాయ్ ఆటపట్టించే వాడు'

ABOUT THE AUTHOR

...view details