తెలంగాణ

telangana

ETV Bharat / sitara

గుండెపోటుతో గాయకుడు ఏఎల్ రాఘవన్ మృతి

తమిళ నటుడు, నేపథ్య గాయకుడు ఏఎల్ రాఘవన్.. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈయన గతంలో దిగ్గజ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లోనూ పాటలు పాడారు.

By

Published : Jun 19, 2020, 6:44 PM IST

Updated : Jun 19, 2020, 7:46 PM IST

ప్రముఖ నేపథ్య గాయకుడు ఏఎల్ రఘవన్ మృతి
ఏఎల్ రఘవన్

తమిళ సినీ గాయకుడు ఏ.ఎల్.రాఘవన్‌(87).. శుక్రవారం కన్నుమూశారు. చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, గుండెపోటుతో మరణించారు.

1950లో తమిళ సినిమా 'కృష్ణ విజయం'తో రాఘవన్, గాయకుడిగా కెరీర్​ ప్రారంభించారు. ఆ తర్వాత ఎందరో ప్రసిద్ధ సంగీత దర్శకులతో కలిసి పనిచేశారు. అందులో కేవీ మహదేవన్‌, విశ్వనాథ్‌-రామ్మూర్తి, ఎస్‌.ఎం.సుబ్బానాయుడు, ఘంటసాల, టీవీ రాజు, ఎస్‌పీ కోదండపాణిలాంటి ఉద్దండులు ఉన్నారు. తోటి గాయకులైన పి.సుశీల, జిక్కి, పి.లీల, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంతోనూ కలిసి ఈయన పాటలు పాడారు.

తెలుగులో దిగ్గజ ఎన్టీఆర్ 'నిండు మనసులు', 'నేనే మెనగాణ్ణి' చిత్రాల్లో పాటలు పాడారు. ఈ రెండింటికి టీవీ రాజు సంగీతమందించారు. పేకేటి శివరామ్‌ దర్శకత్వంలో వచ్చిన 'కులగౌరవం' సినిమాలో 'హ్యాపీ లైఫ్'‌ అంటూ సాగే ఈ గీతాన్ని ఎల్‌.ఆర్‌.ఈశ్వరితో కలిసి ఆలపించారు రాఘవన్.

ఇవీ చదవండి:

Last Updated : Jun 19, 2020, 7:46 PM IST

ABOUT THE AUTHOR

...view details