తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మెగాహీరోతో 'ప్లే బ్యాక్' దర్శకుడి చిత్రం! - వరుణ్ తేజ్ హరిప్రసాద్

'ప్లేబ్యాక్' చిత్ర దర్శకుడు హరిప్రసాద్ మెగా హీరోతో ఓ సినిమా తెరకెక్కించనున్నాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Play Back director Hari Prasad to direct Varun Tej
మెగాహీరోతో 'ప్లే బ్యాక్' దర్శకుడి చిత్రం!

By

Published : Mar 9, 2021, 11:59 AM IST

ఇటీవలే 'ప్లేబ్యాక్' చిత్రంతో ఆకట్టుకున్నాడు దర్శకుడు హరిప్రసాద్. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్​గా చేసిన ఇతడు మొదటి సినిమాతోనే తన ప్రతిభ నిరూపించుకున్నాడు. దీంతో హరికి మెగా హీరోతో మూవీ తెరకెక్కించే అవకాశం వచ్చిందని టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్​కు ఈ దర్శకుడు ఓ కథ చెప్పాడని.. అది అతడికి నచ్చడం వల్ల పూర్తి కథ సిద్ధం చేయమన్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

హరి ప్రసాద్ సుకుమార్ దర్శకత్వం వహించిన 'వన్ నేనొక్కడినే', '100% లవ్' చిత్రాలకు కథ అందించాడు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విజయాన్నందుకున్నాయి. తాజాగా ఇతడు దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'ప్లే బ్యాక్' విడుదలై మంచి టాక్ సంపాదించుకుంది. క్రాస్ టైమ్ కనెక్షన్ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని థ్రిల్​కు గురి చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details