కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానం చేసేందుకు కొవిడ్ విజేతలు ముందుకు రావాలని నటుడు విజయ్ దేవరకొండ కోరారు. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో వ్యాధి నుంచి కోలుకుని ప్లాస్మాను దానం చేసిన వారందరినీ సీపీ వీసీ సజ్జనార్ సత్కరించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఒకరికొకరు సాయపడాలని సజ్జనార్ తెలిపారు.
'నాకు కరోనా వస్తే.. తగ్గిన వెంటనే ప్లాస్మాదానం చేస్తా' - ప్లాస్మాదానం గురించి విజయ్ దేవరకొండ
తనకు కరోనా వస్తే.. కోలుకున్నాక కచ్చితంగా ప్లాస్మాదానం చేస్తానని నటుడు విజయ దేవరకొండ ప్రకటించారు. సైబరాబాద్ కమిషనర్ కార్యాలయంలో కొవిడ్‌ను జయించి ప్లాస్మాదానం చేసేందుకు ముందుకు వచ్చిన దాతలను సత్కరించారు.
'నాకు కరోనా వస్తే.. తగ్గిన వెంటనే ప్లాస్మాదానం చేస్తా'
తనకు కరోనా వస్తే.. కోలుకున్న వెంటనే ప్లాస్మాదానం చేయటానికి సిద్ధం అని విజయ్ దేవరకొండ ప్రకటించారు. ప్లాస్మా దానం చేసి.. ఈ విపత్కర పరిస్థితుల్లో అవసరమున్న వారికి సహాయపడటం గొప్ప విషయమని.. కొవిడ్ విజేతలను సీపీ సజ్జనార్ కొనియాడారు.
ఇదీ చూడండి:భారత్‌కు రఫేల్- వాయుసేనకు కొత్త శక్తి
Last Updated : Jul 31, 2020, 10:04 PM IST