సినిమా కథలు ఒకేలా ఉన్నాయంటూ ఓ దర్శకుడిపై మరో దర్శకుడిపై ఫిర్యాదు చేయడం తమిళ ఇండస్ట్రీలో అప్పుడప్పుడూ జరుగుతూ ఉంటుంది. గతంలో ఇలాంటి అనుభవమే స్టార్ డైరెక్టర్స్ ఏఆర్ మురగదాస్, శంకర్లకు ఎదురయ్యాయి. లింగుస్వామి కూడా గతంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కొన్నారు. అప్పుడు అది పరిష్కారమైనట్లు కనిపించింది. కానీ ఇప్పుడు మరోసారి ఆ వివాదం తెరపైకి వచ్చింది.
ఇంతకీ ఏం జరిగింది?
కోలీవుడ్ మీడియా కథనాల ప్రకారం, 'పందెం కోడి' దర్శకుడు లింగుస్వామి.. 2013లో సూర్యతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేసుకున్నారు. అదే టైమలో సీమన అనే దర్శకుడు, అతడిపై ఫిర్యాదు చేశాడు. సదరు స్క్రిప్ట్‌కు తన 'పగలవన్' కథకు పోలికలున్నాయని అన్నాడు. విజయ్‌తో దీనిని సినిమాగా తీయాలనుకుంటున్నట్లు సీమన్ పేర్కొన్నాడు. ఈ వివాదాన్ని తమిళనాడు డైరెక్టర్ల అసోసియేషన్ పరిష్కరించింది.
ఆ తర్వాత 2014లో సూర్య హీరోగా వేరే కథతో లింగుస్వామి.. అంజాన్(తెలుగులో 'సికిందర్') సినిమా తెరకెక్కించారు. మరోవైపు సీమన్.. 'పగలవన్'ను మొదలేపెట్టలేదు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత మరోసారి లింగుస్వామిపై ఫిర్యాదు చేశారు సీమన్. తెలుగు హీరో రామ్‌తో అదే కథను ఉపయోగించి, సినిమా తీస్తున్నారని పేర్కొన్నారు.
దీంతో డైరెక్టర్ లింగుస్వామి నుంచి అసోసియేషన్ వివరణ కోరింది. 2013లో ఆ వివాదం పరిష్కారమైందని, డైరెక్టర్ల అసోసియేషన్ నుంచి తనకు క్లీన్చిట్ కూడా వచ్చిందని లింగుస్వామి వెల్లడించారు. తమిళంలో తప్పించి ఇతర భాషల్లో ఈ కథను తెరకెక్కించేందుకు తనకు అనుమతి అప్పుడే లభించిందని పేర్కొన్నారు. ఈ వివరణతో సంతృప్తి చెందిన దక్షిణాది సినీ రచయితల అసోసియేషన్.. లింగుస్వామికి క్లీన్చిట్ ఇచ్చింది.
రాయలసీయ బ్యాక్‌డ్రాప్‌తో ఈ కథను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో రామ్‌కు జోడీగా కృతిశెట్టి నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతమందిస్తున్నారు. జులై 12 నుంచి షూటింగ్ మొదలుపెట్టనున్నారు.
ఇవీ చదవండి: