బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమిర్‌ఖాన్ సినిమాకు దిగ్గజ సచిన్ తెందుల్కర్ ప్రచారం చేశాడు. అవును మీరు విన్నది నిజమే. 'పీకే' విడుదల సమయంలో ఇది జరిగింది.
ఆమిర్ ఖాన్ సినిమాకు సచిన్ ప్రచారం! - sachin latest news
ప్రముఖ కథానాయకుడు ఆమిర్‌ఖాన్ సినిమాకు స్టార్ క్రికెటర్ సచిన్ ప్రచారం చేశారు. తనకు తెలిసిన వారందరికీ ఆ సినిమా చూడమని చెప్పారు. అసలు అప్పుడు ఏం జరిగింది?
2014లో వచ్చిన 'పీకే' సినిమా సంచలన విజయం సాధించింది. ఆమిర్ ఖాన్, అనుష్క శర్మ, సుశాంత్ సింగ్ నటన.. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వ ప్రతిభకు అందరూ ఫిదా అయిపోయారు. అయితే వారి కంటే ముందు ప్రత్యేకంగా చూసిన సచిన్‌కు, ఈ చిత్రం తెగ నచ్చేసింది. ఆమిర్ నటనతో నోట మాట రాలేదు. దీంతో తనకు తెలిసిన, కనిపించిన వారందరికీ 'పీకే' గురించి చెప్పడం మొదలుపెట్టాడు. అయితే తన జీవితంలో ఓ సినిమా గురించి సచిన్ ఇంతలా స్పందించలేదట.
దొంగ బాబాలు, దేవుడి పేరుతో జరుగుతున్న మోసాల్ని ఈ సినిమాలో చూపించారు. హాస్యభరితంగా ఉంటూనే, ఆలోచించేలా.. ఇందులోని సన్నివేశాల్ని తెరకెక్కించారు రాజ్‌కుమార్ హిరాణీ. దీంతో బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పీకే' నిలిచింది.