పవన్ కల్యాణ్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో.. బాలీవుడ్ మూవీ 'పింక్' రీమేక్ తెరకెక్కుతోంది. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. వేసవి కానుకగా మే నెలలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి సన్నాహాలు చేస్తోంది చిత్రబృందం. తాజాగా ఫ్యాన్స్‌కు ఓ తీపి కబురు తెలిపింది.
పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. రేపే 'పింక్' రీమేక్ ఫస్ట్‌లుక్ - Pink Telugu Remake latest news
దాదాపు రెండేళ్ల నుంచి పవన్ కల్యాణ్‌ను తెరపై చూడాలని అతడి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పవర్‌స్టార్ ప్రధానపాత్రలో నటిస్తున్న 'పింక్' రీమేక్ నుంచి సోమవారం సర్ప్రైజ్ ఇవ్వనుంది చిత్రబృందం. తొలిరూపు విడుదల చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.
పవన్ ఫ్యాన్స్‌కు పండగే.. రేపే 'పింక్' రీమేక్ ఫస్ట్‌లుక్
పవర్‌స్టార్ 26వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమా నుంచి.. ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఫలితంగా టైటిల్‌పైనా క్లారిటీ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రచారంలో ఉన్న 'వకీల్ సాబ్' పేరే ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మార్చి 8న ఫస్ట్‌సాంగ్‌నూ విడుదల చేయనున్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందులో నటించే తారాగణం, కథానాయిక వంటి విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు.
Last Updated : Mar 3, 2020, 1:45 AM IST