తెలంగాణ

telangana

ETV Bharat / sitara

RRR: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో పిల్​ - ఆర్‌ఆర్‌ఆర్ సినిమా వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో పిల్​
ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో పిల్​

By

Published : Jan 5, 2022, 2:45 PM IST

Updated : Jan 5, 2022, 3:23 PM IST

14:42 January 05

RRR: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో పిల్​

RRR: ఆర్‌ఆర్‌ఆర్ సినిమాపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అల్లూరి సీతారామరాజు, కుమురం భీం చరిత్రను వక్రీకరించారని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా సత్యవరపు ఉండ్రాజవరానికి చెందిన అల్లూరి సౌమ్య పిల్​ దాఖలు చేశారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వొద్దని.. చిత్రం విడుదలపై స్టే ఇవ్వాలని పిటిషనర్​ కోరారు.

జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ వెంకటేశ్వరరెడ్డి ధర్మాసనం ముందుకు ఈ వ్యాజ్యం రాగా.. పిల్ కాబట్టి సీజే ధర్మాసనం విచారణ జరుపుతుందని జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తెలిపారు.

రూ.450 కోట్లతో నిర్మాణం

RRR postponed: దాదాపు రూ.450 కోట్లతో నిర్మించిన ఈ భారీ బడ్జెట్​ సినిమాలో రామ్​చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లు. అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు. కీరవాణి సంగీతమందించారు. రాజమౌళి దర్శకత్వం వహించారు. డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు.

రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా

RRR postponed: ఇప్పటికే చాలాసార్లు వాయిదాపడిన 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ డేట్ మరోసారి మారింది. ఇటివలే జనవరి 7న సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం లేదని చిత్రబృందం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది. తనపై ప్రేమ చూపిస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపింది.

2018 చివరిలో అధికారికంగా ప్రకటన వచ్చిన ఈ సినిమాను తొలుత 2020 జులై 30న విడుదల చేస్తామని అన్నారు. ఆ తర్వాత 2021 జనవరి 7వ తేదీకి మార్చారు. ఆ తర్వాత కరోనా ప్రభావం, షూటింగ్ ఆలస్యం కావడం వల్ల అక్టోబరు 13న థియేటర్లలోకి తీసుకొస్తామని అన్నారు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ చేస్తామని చెప్పడం సహా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రచారంతో హోరెత్తించారు. అయితే ఒమిక్రాన్ కేసులు, పలు రాష్ట్రాల్లో ఆంక్షలు, థియేటర్లు మూసివేత.. ఇలా రకరకాల కారణాల వల్ల సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి:

Last Updated : Jan 5, 2022, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details