తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అమ్మ శ్రీదేవిలా లేనంటూ ఖుషి కపూర్‌ భావోద్వేగం

ప్రముఖ నటి, అతిలోక సుందరి శ్రీదేవి రెండో కుమార్తె ఖుషి కపూర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లి శ్రీదేవి రూపం తనకు రాలేదని కొందరు జోకులు వేసుకున్నారని వాపోయారు ఖుషి. ఈ విషయంపై తన మనసులోని మాటలు ఆడియో రూపంలో పంచుకున్నారు.

People made fun of me says Khushi Kapoor
అమ్మ శ్రీదేవిలా లేనని.. ఖుషి కపూర్‌ భావోద్వేగం

By

Published : May 18, 2020, 8:30 PM IST

సినీ స్టార్స్‌ వారసులు అనగానే అభిమానులు వారిపై భారీ అంచనాలు పెట్టుకుంటుంటారు. అభిమానం కొద్దీ అచ్చం తన తండ్రి లేదా తల్లిలానే ఉండాలని, నటించాలని ఆశిస్తుంటారు. అయితే ప్రతిసారీ ఇలా ఆలోచించడం సరికాదు. అతిలోకసుందరిగా వెండితెరను ఏలిన శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వి ఇప్పటికే నటిగా రాణిస్తున్నారు. ఆమె రెండో కుమార్తె ఖుషి కపూర్‌ నటనలో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఆమె తాజాగా తన మనసులోని మాటలు ఆడియో రూపంలో పంచుకున్నారు. కొందరు తన తల్లి శ్రీదేవి రూపం తనకు రాలేదని జోక్‌లు వేసుకున్నారని భావోద్వేగానికి గురయ్యారు. దీన్ని 'క్వారంటైన్‌ టేప్స్‌-1' టైటిల్‌తో ఓ నెటిజన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు (ఖుషికి ప్రైవేట్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఉంది).

శిక్షణలో ఫొటోకు పోజులు

"నేను ఓ వ్యక్తిగా ఎంత ఉన్నతంగా ఉండాలి అనుకున్నానో.. ప్రస్తుతానికి అలా లేను. కానీ రోజురోజుకీ ఎదుగుతున్నా. కొందరు (శ్రీదేవి అభిమానులు) నాపై అమితమైన ప్రేమను కురిపించడం, ప్రశంసించడం బహుమతిలా అనిపిస్తుంది. దీనికి నేను అర్హురాల్ని కాదు. అంత గొప్ప పని ఇంకా చేయలేదు. ఒకవేళ ఇతరుల్ని సంతోషంగా ఉంచే శక్తి నాకుంటే.. అప్పుడు ఈ ప్రశంసలకు ఓ అర్థం ఉంటుంది."

కుటుంబ సమేతంగా ఖుషి కపూర్​

"కొందరు అభిమానులు ఇప్పటికీ నన్ను విమర్శిస్తున్నారు. నాకు భయం, సిగ్గు ఎక్కువ. చిన్నతనంలోనే ఇలాంటి విద్వేషపూరిత మాటలు వింటే బాధగా అనిపిస్తోంది. నేనూ అందరిలాంటి అమ్మాయినే అని ప్రజలకు చెప్పాలి అనిపిస్తుంటుంది. ఇలాంటి విమర్శల్ని ఎలా ఎదుర్కోవాలో నాకు ఒక్కోసారి అర్థం కాదు."

అమ్మ శ్రీదేవిలా లేనని.. ఖుషి కపూర్‌ భావోద్వేగం

"నేను మా అమ్మలా లేను, నా సోదరిలా లేనని ప్రజలు వేలెత్తి చూపుతున్నారు. నాపై జోక్‌లు వేస్తున్నారు. ఇది నేను ఆహారం తీసుకునే విధానం, దుస్తులు ధరించే తీరుపై ఆధారపడి ఉంటుంది."

అమ్మ శ్రీదేవిలా లేనని.. ఖుషి కపూర్‌ భావోద్వేగం

"మనల్ని మనం స్వతహాగా స్వీకరించాలి. ముందు మనల్ని మనం ఇష్టపడాలి. నచ్చిన పనిచేస్తూ ఆనందంగా ఉండాలి. అప్పుడే ప్రజలు మనల్ని మెచ్చుకుంటారనేది నా నమ్మకం" అంటూ ఖుషి ఆడియో టేప్‌ ముగిసింది.

ఇదీ చూడండి:ప్రేయసితో నగ్నంగా పోజులిచ్చిన మిలింద్ సోమన్

ABOUT THE AUTHOR

...view details