తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ముద్దు సీన్లలో నేను.. వాళ్లకు నచ్చేది కాదు!' - Preeti Jhangiani kiss scenes

తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ ప్రీతి జింగానియా.. కెరీర్​లో తనకెదురైన విచిత్ర అనుభవాల్ని ఇటీవల వెల్లడించింది. ముద్దు సీన్లలో నటించలేకపోవడానికి గల కారణాల్ని చెప్పింది.

Preeti Jhangiani
ప్రీతి జింగానియా

By

Published : Aug 23, 2021, 9:38 AM IST

తాను ముద్దు సీన్లలో నటించడం అభిమానులకు అస్సలు నచ్చదని నటి ప్రీతి జింగానియా చెప్పింది. 'తమ్ముడు', 'నరసింహనాయుడు' లాంటి తెలుగు సినిమాల్లో కథానాయికగా చేసిన ఈ భామ.. ప్రస్తుతం ఓటీటీలో నటించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించింది.

"ప్రేక్షకులు ఇప్పటికీ 'చుయిమయి అమ్మాయి' లేదా 'మొహబ్బతిన్ అమ్మాయి'గానే గుర్తిస్తారు. ఇలా వారు అనుకోవడం బాగానే ఉన్నప్పటికీ, ఎప్పుడు చీరలు ధరించే పాత్రల్లో నటించడం ఇబ్బందిగానూ ఉంది. అలానే ముద్దు సీన్లలో నటించడం నా అభిమానులకు నచ్చేది కాదు. కెరీర్​లో ఇతర పాత్రలు కూడా నాకు చేయాలని ఉంది. ఇలా కేవలం చీరలు కట్టుకునే పాత్రలకే పరిమితం కావాలనుకోవడం లేదు" అని ప్రీతి జింగానియా చెప్పింది.

ప్రీతి జింగానియా

పర్విన్ దబాస్​ను పెళ్లి చేసుకున్న ప్రీతికి ప్రస్తుతం ఇద్దరు అబ్బాయిలు. నటిలా కాకుండా నిజ జీవితంలో తాను వేరుగా ఉంటానని ఈమె చెప్పింది. తల్లిదండ్రులు చాలా ముందుచూపు కలిగినవారని తెలిపింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details