తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కొడుకును కాపాడుకునేందుకు కీర్తి పోరాటం - పెంగ్విన్​ ట్రైలర్​ విడుదల

కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన 'పెంగ్విన్' ట్రైలర్​ను హీరో నాని విడుదల చేశారు. సస్పెన్స్ థ్రిల్లర్​ కథతో రూపొందిన ఈ సినిమా.. జూన్ 19న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

keerthi
కీర్తి సురేశ్ న

By

Published : Jun 11, 2020, 1:31 PM IST

హీరోయిన్ కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పెంగ్విన్‌'.. తెలుగు ట్రైలర్​ను నేచురల్​ స్టార్​ నాని విడుదల చేశారు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ ప్రచారచిత్రం‌ ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. అపహరణకు గురైన తన కుమారుడి ఆచూకీ కోసం కీర్తి సురేశ్‌ పడే వేదన చుట్టూ సాగే కథే ఈ చిత్రం.

జోకర్‌ వేషంలో ఉన్న ఓ వ్యక్తి, గొడ్డలితో ఎవర్నో చంపుతూ కనిపించాడు. తమిళ టీజర్‌ను ధనుష్​, మలయాళ ట్రైలర్​ను​ మోహన్​లాల్​ విడుదల చేశారు.

ఇందులో కీర్తి తల్లి పాత్రను పోషించారు. అపహరణకు గురైన తన కుమారుడు అజయ్‌ను ఓ రాక్షసుడి బారి నుంచి కాపాడేందుకు ఆమె చేసే పోరాటం.. ఈ క్రమంలో ఆమె ఎదుర్కొనే సమస్యలను చాలా ఆసక్తికరంగా చూపించారు. ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ నిర్మించగా, ఈశ్వర్ కార్తీక్ డైరెక్షన్ చేశారు. ఈనెల 19 నుంచి అమెజాన్ ప్రైమ్​లో స్ట్రీమ్ కానుంది.

ఇది చూడండి : మరోసారి బిగ్​బీ ఉదారత.. ఏం చేశారంటే?

ABOUT THE AUTHOR

...view details