తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఓ తల్లి వేదన - అమెజాన్ ప్రైమ్​లో పెంగ్విన్

కథానాయిక కీర్తి సురేశ్ నటించిన 'పెంగ్విన్' టీజర్​ ఆకట్టుకుంటోంది. సస్పెన్స్ థ్రిల్లర్​ కథతో రూపొందిన ఈ సినిమా.. జూన్ 19న ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

పెంగ్విన్ టీజర్: కుమారుడి ఆచూకీ కోసం ఆ తల్లి వేదన
పెంగ్విన్ సినిమాలో కీర్తి సురేశ్

By

Published : Jun 8, 2020, 7:08 PM IST

హీరోయిన్ కీర్తి సురేశ్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పెంగ్విన్‌'.. తెలుగు టీజర్‌ను ముద్దుగుమ్మ సమంత నేడు విడుదల చేసింది. ఆద్యంతం ఆసక్తికర సన్నివేశాలతో దీనిని రూపొందించారు. అపహరణకు గురైన తన కుమారుడి ఆచూకీ కోసం కీర్తి సురేశ్‌ పడే వేదన చుట్టూ సాగే కథే ఈ చిత్రం.

'మీ అందరి కథ వెనుక.. ఓ అమ్మ కథ ఉంది. మీ ప్రయాణం మొదలైంది ఆమె నుంచే..' అని టీజర్‌లో చూపించారు. చివరిలో జోకర్‌ వేషంలో ఉన్న ఓ వ్యక్తి గొడ్డలితో ఎవర్నో నరుకుతూ కనిపించాడు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ సినిమా టీజర్‌కు యూట్యూబ్‌లో మంచి స్పందన లభిస్తోంది. తమిళ టీజర్‌ను త్రిష, మలయాళ టీజర్‌ను మంజూ వారియర్‌ విడుదల చేశారు.

'పెంగ్విన్‌'కు ఈశ్వర్‌ కార్తిక్‌ దర్శకుడు. కార్తికేయన్‌ సంతానం, సుధన్‌ సుందరం, జయరాం సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను జూన్‌ 11న విడుదల చేయబోతున్నారు. జూన్‌ 19న అమెజాన్‌ ప్రైమ్‌లో చిత్రం అభిమానుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details