దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న చిత్రం 'పెళ్లి సంద..డి'. ఇందులోని 'బుజ్జులు బుజ్జులు' అంటూ సాగే పాట లిరికల్ వీడియో విడుదలై ఆకట్టుకుంటోంది. హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. గౌరీ రోనంకి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
'పెళ్లి సంద..డి' సాంగ్.. 'కపటనాటక సూత్రధారి' ట్రైలర్ - కపటనాటక సూత్రధారి ట్రైలర్ రిలీజ్
కొత్త సినిమా అప్డేట్స్ వచ్చాయి. 'పెళ్లి సంద..డి'లోని ఓ లిరికల్ వీడియో సాంగ్, 'కపటనాటక సూత్రధారి' ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి.
పెళ్లి సంద..డి
సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న 'కపటనాటక సూత్రధారి' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకుంటోంది. ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ ఈ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. విజయ్ శంకర్, సంపత్ కుమార్, భానుచందర్, రవిప్రకాశ్ కీలక పాత్రల్లో నటించగా.. క్రాంతి సైన దర్శకత్వం వహించారు.