తెలంగాణ

telangana

ETV Bharat / sitara

pellisandaD: శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామి ఆలయంలో పెళ్లిసందD బృందం... - Pellisandadi unit visited vishaka district

సింహాచలం శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామి వారిని పెళ్లిసందD(pellisandhadi) చిత్ర బృందం దర్శించుకుంది. ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. సినిమా విజయం సాధించాలని స్వామి వారిని ప్రార్థించినట్లు చిత్ర బృందం తెలిపింది.

pellisandaD
pellisandaD

By

Published : Oct 12, 2021, 2:47 PM IST

విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరహా లక్ష్మినృసింహ స్వామి వారిని పెళ్లిసందD చిత్ర బృందం సభ్యులు దర్శించుకున్నారు. చిత్ర హీరో రోషన్ శ్రీకాంత్, హీరోయిన్ శ్రీలీల, డైరెక్టర్ గౌరి రేణుక... స్వామి వారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయ అధికారులు వారికి సాదరంగా స్వాగతం పలికారు. వారు కప్ప స్తంభం ఆలింగనం చేసుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో... హీరో రోషన్​ శ్రీకాంత్​కు తీర్థ ప్రసాదాలను అందించారు. హీరో రోషన్ శ్రీకాంత్​తో ఫొటోలు దిగడానికి భక్తులు ఎగబడ్డారు. సినిమా విజయవంతం కావాలని ఆ స్వామివారిని వేడుకున్నట్లు పెళ్లిసందD యూనిట్ వెల్లడించింది.

ABOUT THE AUTHOR

...view details