దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో(Raghavendra Rao Pelli SandaD) కథానాయకుడు శ్రీకాంత్ తనయుడు రోషన్, శ్రీలీల జంటగా నటించిన చిత్రం 'పెళ్లిసందD'. గౌరి రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్‌ను(PelliSandaD Teaser) ప్రముఖ కథానాయకుడు నాగార్జున విడుదల చేశారు.
PelliSandaD Teaser: 'పెళ్లిసందD' మామూలుగా లేదు!
యువ కథానాయకుడు రోషన్, శ్రీలీల జంటగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో రూపొందిన చిత్రం 'పెళ్లిసందD'. గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ చిత్ర టీజర్‌ను(PelliSandaD Teaser) 'కింగ్' నాగార్జున విడుదల చేశారు.
PelliSandaD Teaser: ఈసారి 'పెళ్లిసందD' మామూలుగా లేదు
బాస్కెట్ బాల్ ఆట నేపథ్యంగా సాగే సన్నివేశంతో ప్రారంభమైన టీజర్.. ఆద్యంతం ఆసక్తికగా సాగింది. "సహస్ర.. పెళ్లి నాతోనా లేక తొట్టిగ్యాంగ్ లీడర్ తోనా" అంటూ ప్రకాశ్ రాజ్‌తో రోషన్ చెప్పే సంభాషణలు 'పెళ్లిసందD' ఎంత సందడిగా ఉండబోతుందో అర్థమవుతోంది. ఈ చిత్రంలో రాఘవేంద్ర రావు వశిష్ట పాత్రలో నటించడం విశేషం. కీరవాణి సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం త్వరలోనే(Pelli Sandad Release Date) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదీ చూడండి..రాఘవేంద్రరావు నటుడిగా.. వీడియోలో స్టైలిష్‌గా