నాగార్జున కథానాయకుడిగా, కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'బంగార్రాజు' చిత్రం రూపొందనుంది. ఈ సినిమా షూటింగ్‌ను జులైలో ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులోని ఓ ప్రత్యేక గీతం కోసం 'ఆర్‌ఎక్స్ 100' భామ పాయల్ రాజ్‌పుత్‌ను ఎంపిక చేశారని వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో రమ్యకృష్ణతో పాటు నాగచైతన్య కూడా నటించనున్నారు. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
'బంగార్రాజు'లో ఐటమ్ భామగా పాయల్? - బంగార్రాజు ఐటెంసాంగ్‌లో పాయల్ రాజ్‌పుత్
కింగ్ నాగార్జున హీరోగా 'సోగ్గాడే చిన్నినాయన' సినిమాకు ప్రీక్వెల్ 'బంగార్రాజు' చిత్రాన్ని దర్శకుడు కల్యాణ్‌కృష్ణ రూపొందించనున్నారు. జులైలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో ఓ ప్రత్యేక గీతం కోసం పాయల్ రాజ్‌పుత్‌ను సంప్రదించినట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది.
'బంగార్రాజు'లో ఐటమ్ భామగా పాయల్?
అందాల సుందరి పాయల్ తెలుగులో వెంకటేశ్‌తో కలిసి 'వెంకీమామ', రవితేజ సరసన 'డిస్కోరాజా' చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో కలిసి 'ఏంజెల్' అనే చిత్రంలో చేస్తోంది. పాయల్ నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అప్పుడప్పుడు హాట్ ఫొటోషూట్స్‌తో కనిపిస్తూ సందడి చేస్తుంటుంది.
ఇదీ చూడండి..ఉగ్రవాది పాత్ర కోసం చాలా కష్టపడ్డా: సమంత
Last Updated : May 21, 2021, 8:11 PM IST