యువ కథానాయిక పాయల్ రాజ్‌పుత్.. బాలకృష్ణ సరసన నటించనుందని సమాచారం. బాలయ్య- బోయపాటి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రంలో నాయికగా పాయల్‌ను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చిత్రబృందం పలువురు బాలీవుడ్ నాయికల్ని, సీనియర్ హీరోయిల్ని సంప్రదించినట్లు వార్తలొచ్చాయి. అయితే వాళ్ల డేట్స్ ఖాళీగా లేకపోవడం, రెమ్యునరేషన్ ఎక్కువ ఉండటం వల్ల పాయల్‌ని కలిశారని టాలీవుడ్ టాక్.
బాలయ్యతో 'ఆర్ఎక్స్100' భామ రొమాన్స్! - Payal Rajput Balakrishna
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ను ఇంకా ఖరారు చేయలేదు. తాజాగా బాలయ్యకు జోడీగా పాయల్ రాజ్‌పుత్ నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి.
బాలయ్య
త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్టులో నటించబోయే నాయిక ఎవరో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఎన్టీఆర్ జీవితాధారంగా క్రిష్ తెరకెక్కించిన 'ఎన్టీఆర్ కథానాయకుడు'లో బాలయ్యతో కలిసి నటించింది పాయల్. మరోసారి ఈ జోడి కలిసి నటిస్తుందనడం వల్ల అందరిలోనూ ఆసక్తి పెరిగింది.