బాయ్‌ఫ్రెండ్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఓ షార్ట్‌ఫిల్మ్‌లో పాయల్ రాజ్‌పుత్ నటించారు. 'ఆర్‌ఎక్స్ 100' చిత్రంతో వెండితెరకు పరిచయమై ప్రేక్షకులను అలరించిన నటి పాయల్. బోల్డ్ తరహా పాత్రతో మొదటి సినిమాతోనే ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ క్యాన్సిల్ కావడం వల్ల ఇంటికే పరిమితమయ్యారు. దీంతో ఆమె తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా డైరెక్షన్‌లో తెరకెక్కిన 'ఏ రైటర్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు.
24 గంటల్లోనే షార్ట్ ఫిల్మ్.. ఆకట్టుకున్న పాయల్ నటన - పాయల్ రాజ్‌పుత్ షార్ట్ ఫిల్మ్
నటి పాయల్ రాజ్‌పుత్ లాక్‌డౌన్ కారణంగా ఇంటివద్దే ఉంటున్నారు. ఈ ఖాళీ సమయంలో తన బాయ్‌ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా దర్శకత్వం వహించిన 'ఏ రైటర్' అనే షార్ట్ ఫిల్మ్‌లో నటించారు. తాజాగా ఈ వీడియోను అభిమానులతో పంచుకున్నారు.
పాయల్
గృహహింసను ప్రధానాంశంగా చేసుకుని రూపొందిన ఈ కథను సౌరభ్ రచించారు. పాయల్‌తోపాటు ఆయన కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. 24 గంటల్లోనే చిత్రీకరించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌ను తాజాగా ఆమె సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 16 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో పాయల్ తన నటనతో మెప్పించారు.