తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వేశ్య పాత్రలో హీరోయిన్​ పాయల్ రాజ్​పుత్ - టబు

ఆర్​ఎక్స్ 100తో క్రేజీ హిరోయిన్​గా మారిన పాయల్ రాజ్​పుత్​ ఓ వేశ్య పాత్రలో నటించనుంది. 'టైగర్​ నాగేశ్వరరావు' సినిమాలో ఆమె ఈ పాత్రలో కనిపించనుంది. ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించింది.

వేశ్య పాత్రలో హీరోయిన్​ పాయల్ రాజ్​పుత్

By

Published : May 27, 2019, 12:49 PM IST

పాయల్‌ రాజ్‌పుత్... ‘ఆర్‌ఎక్స్‌ 100’ చిత్రంతో ఒక్కసారిగా కుర్రకారు మదిలో కలల రాణిగా మారింది. బోల్డ్​ నటన​తో చిత్రసీమ దృష్టిని తనవైపు తిప్పుకుంది. ప్రస్తుతం ఈ భామకు వరుస అవకాశాలు అందుతున్నాయి. ‘మన్మథుడు 2’, ‘డిస్కోరాజా’, ‘వెంకీ మామ’ వంటి క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది.

బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అనే బయోపిక్‌ త్వరలో సెట్స్‌పైకి వెళ్లనుంది. వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పాయల్‌ వేశ్య పాత్రలో కనిపించనుంది. పాయల్ ఈ విషయం ఇటీవలే వెల్లడించింది.

హీరోయిన్​ పాయల్ రాజ్​పుత్

"రాణీ ముఖర్జీ, టబు, అనుష్క వంటి స్టార్స్‌ వేశ్య పాత్రలు చేశారు. వాటిని నేను చూశాను. ఇప్పుడు నా స్టైల్‌లో ఆ పాత్రను పండించాలనుకుంటున్నా. వేశ్యల జీవితాలు అంత సులువు కాదు. కేవలం డబ్బు కోసం, లగ్జరీల కోసం వారు ఇలాంటి పనులు చేస్తుంటారని అనుకోవడం పొరపాటు"- పాయల్ రాజ్​పుత్, హీరోయిన్​

‘టైగర్‌ నాగేశ్వరరావు’.. ఈ పేరు ప్రస్తుత తరానికి పరిచయం లేకపోవచ్చు. కానీ 1980 - 90 దశకాల్లో అతడు తెలుగువారిని వణికించాడు. స్టూవర్ట్​పురం గజదొంగగా టైగర్‌ సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. ఇప్పుడతని జీవితగాథ వెండితెరపైకి రానుండటం అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details