తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రాశీఖన్నా.. పాయల్‌.. డబుల్‌ బొనాంజా - ప్రతిరోజూ పండగే ట్రైలర్

హీరోయిన్లు పాయల్ రాజ్​పుత్, రాశీఖన్నా.. ఈనెలలో రెండేసి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మరి వీరిద్దరిలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.

రాశీఖన్నా.. పాయల్‌.. డబుల్‌ బొనాంజా
వెంకీమామ పోస్టర్

By

Published : Dec 5, 2019, 7:48 PM IST

టాలీవుడ్​ హీరోయిన్లు రాశీ ఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లకు ఈ డిసెంబరు మరపురానిదిగా మిగిలిపోనుంది. ఎందుకంటే ఈ ఇద్దరు భామలు నటించిన సినిమాలు బ్యాక్​టు బ్యాక్​గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఏ మేరకు అలరిస్తారో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

రానున్న రెండు వారాలు వరుసగా తెరపై సందడి చేయనుంది కథానాయిక రాశీఖన్నా. ఈమె నటించిన వెంకటేశ్​-నాగచైతన్య మల్టీస్టారర్ 'వెంకీమామ' ఈనెల 13న, సాయిధరమ్ తేజ్​ 'ప్రతిరోజూ పండగే' 20న రానున్నాయి. ఈ చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటం విశేషం.

హీరోయిన్ రాశీఖన్నా

పాయల్‌ రాజ్‌పుత్‌.. ఈనెలలో రెండు సినిమాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది. వీటిలో ఒకటి 'వెంకీమామ'.. మరొకటి రవితేజ 'డిస్కోరాజా'. గురవారం పాయల్ పుట్టినరోజు సందర్భంగా కొత్త పోస్టర్​లను విడుదల చేశాయి చిత్రబృందాలు. ఇటీవలే 'ఆర్డీఎక్స్‌ లవ్‌'తో దారుణ ఫలితాన్ని అందుకున్న పాయల్‌.. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలే పెట్టుకుంది.

రెండు సినిమాల్లో పాయల్ రాజ్​పుత్

ABOUT THE AUTHOR

...view details