పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ జంటగా తెరకెక్కిన చిత్రం 'అనగనగా ఓ అతిథి'. దయాల్ పద్మనాభన్ దర్శకత్వం వహించారు. ప్రముఖ కథానాయకుడు వెంకటేష్ మంగళవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తి రేకెత్తిస్తోందీ ప్రచార చిత్రం.
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రల్లో దర్శనమిచ్చిన పాయల్ ఈ చిత్రంలో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర పోషించిందనిపిస్తుంది. పల్లెటూరి అమ్మాయిగా కనిపించి తనలోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. 'ఒకరు బతకాలంటే ఇంకొకరు చావాలి అదే సృష్టి' అనే ఆసక్తికర అంశంతో వస్తుందీ చిత్రం.
ప్రశాంతంగా ఉండే జీవితంలోకి వచ్చిన ఆ అతిథి ఎవరు? సైలెంట్‌గా ఉండే పాయల్ కిల్లర్‌గా ఎందుకు మారింది తెలుసుకోవాలంటే చిత్రం విడుదలయ్యే వరకు ఆగాల్సిందే. కన్నడలో రూపొందిన 'ఆ కరళ రాత్రి' అనే క్లాసిక్ థ్రిల్లర్ చిత్రానికి తెలుగు రీమేక్ ఈ సినిమా. నవంబరు 20న ఆహా డిజిటల్ వేదికపై ఈ చిత్ర విడుదల కానుంది.